పెద్దరాతుపల్లి గ్రామంలో శిశు విక్రయాలు.. బాధిత కుటుంబాలను జిల్లా అధికారులు విచారణ...
.
ప్రజ గొంతుక ( ప్రిబ్రవరి 21)కాల్వ శ్రీరాంపూర్ : పుట్టిన బిడ్డపై తల్లి ప్రేమకు మించి ఇంకోటి లేదంటారు. తొమ్మిది నెలల బాధను అనుభవించి మరీ బిడ్డను కంటారు బిడ్డకు జన్మనివ్వడం అంటే మరుజన్మగా భావిస్తుంటారు. బోసి నవ్వులు చూసి మురుస్తూ ఉంటుంది మాతృమూర్తి.. బిడ్డను పోషించే స్తోమత లేని కుటుంబాలను ఈ మధ్యకాలంలో శిశు విక్రయాల సభ్యులు అలాంటి వారిని గుర్తించి వారికి డబ్బులు ఏరగవేస్తూ, శిశు విగ్రహాలు చేస్తూ ఉంటారు. అచ్చం అలాంటి గటనే మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలు అయిన చెంచు కుటుంబాలకు చెందిన బండి రజిత సురేష్, బండి శిరీష అంజి,వేపచెట్టు రాణి మహేష్, అను ముగ్గురు దంపతులు పెద్దపెల్లి మాత శిశు ఆసుపత్రి డెలివరీ అయిన, ఆ తర్వాత డిశ్చార్జి అనంతరం శిశువులతో రాకుండా, గ్రామానికి తల్లిదండ్రులు రావడంతో, ఈ విషయం ఆ నోట ఈ నోట బయటికి పొక్కడంతో..వారి నుంచి శిశువిక్రయాలు జరిగాయి అనే విషయం జిల్లా అధికారులకు తెలియడంతో,జిల్లా కేంద్రంలో సంచలంగా మారింది. జిల్లా వెల్ఫేర్ అధికారులు ఆదేశాల మేరకు సంబంధిత జిల్లా వైద్య అధికారి డాక్టర్ రాజమౌళి, ప్రమోద్ కుమార్,అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు కనకరాజు, శనివారం రోజున ఆ గ్రామంలో లోని చెంచు కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విక్రయ ముఠా దారులకు,మధ్యవర్తుల ద్వారా అధికారులు రాక విషయం ముందే తెలిసిన శిశు విక్రయదారులు, శుక్రవారం రాత్రి వేళలో ఆ కొనుగోలు చేసిన శిశువులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు సమాచారం.. అధికారులు వారి తల్లిదండ్రులను విచారణ చేయగా, వారు వివరాలు ఎంతకు చెప్పకపోవడం తో, పిల్లలను వారి తల్లిదండ్రులను పెద్దపెల్లిలోని శిశువు చైల్డ్ ప్రొటెక్షన్ కు తరలించినట్లుఅధికారులు తెలిపారు. శిశువిక్రయదారులపై, మధ్యవర్తిత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం పెద్ద పల్లి చైల్డ్ వెల్ఫేర్ కార్యాలానికి తరలించరు.అసలు ఈ ముటా వెనుక ఉన్నది... ఆ మధ్యవర్తితులు ఎవరన్నది తెలియాల్సిన ఇంకా ఉన్నది... విచారణ అధికారుల వెంబడి... ఆర్ ఐ నిహారిక, మండల వైద్యాధికారులు మహేందర్, చందన, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ సావిత్రి నిహారిక తదితరులు ఉన్నారు.












