ప్రపంచ మానవాళికి కమ్యూనిజమే మార్గం.......
ఘనంగా రెడ్ బుక్ డే
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:21
రెడ్ బుక్ డే అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక ముఖ్యమైన దినోత్సవమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు
శనివారం సుందరయ్య భవన్ హాలియాలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కొండేటి శ్రీను అధ్యక్షతన నిర్వహించిన రెడ్ బుక్ డే సందర్భంగా బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం అనే బుక్ ను సిపిఎం నాగార్జున సాగర్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తలు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ సామాజిక మార్పు, మానవ హక్కులు మరియు సమానత్వం కోసం రాసిన గొప్ప పుస్తకాలను గౌరవించుకోవడానికి ఈ రోజును కేటాయించారని అన్నారు.1848 ఫిబ్రవరి 21న కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంగెల్స్ రాసిన "కమ్యూనిస్ట్ మేనిఫెస్టో" మొదటిసారిగా ప్రచురించబడింది. ఈ పుస్తకం ప్రపంచ చరిత్రను, రాజకీయాలను మరియు సామాజిక ఆలోచనా దృక్పథాన్ని విప్లవాత్మకంగా మార్చివేసింది. ఆ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అభ్యుదయ రచయితలు, మేధావుల మీద దాడులు పెరుగుతున్న తరుణంలో,అంటే ప్రజాస్వామ్య విలువల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా, శ్రామిక వర్గాల హక్కుల కోసం రాసిన సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించడం. స్వేచ్ఛా ఆలోచనలను మరియు పుస్తకాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం పుట్టిందని,
'రెడ్ బుక్' అంటే కేవలం కమ్యూనిస్ట్ పుస్తకాలు అని మాత్రమే కాదు. సామాజిక న్యాయం, సమానత్వం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఏ అభ్యుదయ పుస్తకాన్నైనా 'రెడ్ బుక్'గా పరిగణించాలని అన్నారు.ఈరోజు పఠన సంస్కృతి పెంచే దృష్టితో సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఎంత అవసరమో ప్రజలకు వివరించాలి.అభ్యుదయ విప్లవ భావాలు అభివృద్ధి చేసే లక్ష్యంతో కుల, మత, వర్గ విభేదాలకు వ్యతిరేకంగా పోరాడిన మేధావుల రచనలను నేటి తరానికి పరిచయం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తమ ఆయుధాలను అమ్ముకోవడానికి దేశాల మధ్యన యుద్ధాలు సృష్టిస్తుందని ఆరోపించారు యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఏకం చేయాల్సిన కర్తవ్యం మనపై ఉందని అన్నారు అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సుంకాలను పెంచుతూ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకరావలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శిలు దైద శ్రీను, అవుత సైదులు, దుబ్బ రామచంద్రయ్య, జటావత్ రవి నాయక్, మండల కమిటీ సభ్యులు కోమాండ్ల గురువయ్య, ఎస్ కే బషీర్, కత్తి శ్రీనివాస్ రెడ్డి, ఆకారపు నరేష్, పల్లపు ఇదయ్య,కోరే రమేష్, దొంతాల నాగార్జున, దొరేపల్లి మల్లయ్య, ముత్యాల కేశవులు, పొదిల వెంకన్న, వెంపటి మహేష్, జానీ, రామకృష్ణ, అన్నేపాక శ్రీను, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు












