బ్యాడ్మింటన్‌లో వరంగల్ ఏసీపీల జోడీకి స్వర్ణం.
(ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ) ఫిబ్రవరి (20)
సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో వరంగల్ అధికారులు సత్తా చాటారు. 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్ ల జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. కోర్టులో పదునైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసి ప్రథమ స్థానంలో నిలిచారు.












