కొలచిన వాళ్లకు కొంగు బంగారంగా వరాల దుర్గమ్మ తల్లి
ప్రజాగొంతుక న్యూస్/జనగామ రూరల్:
తల్లి.....మేము ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్న.. మమ్మల్ని దీవించు తల్లి అని వేడుకున్న ఆ భక్తులు కోరిన కోర్కెను నిజం చేసింది మండలంలోని పెంబర్తిలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ వరాల దుర్గమ్మ తల్లి ఆలయం.తలచిన వాళ్లకు తల మీద ఉంటా అంటూ...అమ్మవారు వరం ఇచ్చేసింది. ఆ భక్తులు ఎవరో కాదు జనగామ మున్సిపల్ కార్పొరేషన్ లో 20వ వార్డు నుండి గెలిచిన దామెర రామ - రాజు దంపతులు.3 నెలల క్రితం దుర్గమ్మను దర్శించుకున్నారు.అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా తమ కోరిక నెరవేరితే ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళం ఇస్తానని మొక్కుకున్నారు.అమ్మ వారు కరుణించారు.మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు.శుక్రవారం మళ్లీ అమ్మవారి దర్శనానికి దామెర రమా- రాజు దంపతులు విచ్చేశారు.దర్శనం అనంతరం ఆలయ కమిటీ వారికి లక్ష రూపాయల నగదును సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేఖ రాజు,ఉప సర్పంచ్ కొండబోయిన రాజు,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,తదితరులు రమా-రాజు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.












