గంగం సతీష్ రెడ్డి మానవత దృక్పథం...
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గత కొన్ని రోజుల క్రితం బచ్చన్నపేట మండలం, మన్సాన్పల్లి గ్రామంలో కొమురవెల్లి పోచమ్మ మరణించిన విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ నాయకులు ద్వారా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి కి సమాచారం అందించడంతో వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఫోన్ చేసి ఆ కుటుంబం నిరుపేద కుటుంబమని తెలియజేసిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిన గంగం సతీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవలు గ్రామానికి ఎంతో అవసరం అని, రానున్న రోజుల వారి సేవలను ప్రజలందరికి ఆపద సమయంలో అదేవిధంగాాా కృషి చేయాలని కోరారు. మానవత దృక్పధం గల నాయకులే ప్రజలకు మేలు చేస్తారని వారి మేలు మరువలేమని ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ బిఆర్ఎస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












