వరంగల్ కమిషనరేట్ కు మరో రెండు పతకాలు
(ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక)
ఫిబ్రవరి /19
సైబరాబాద్ వేదికగా జరుగుతున్న 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులు సత్తా చాటారు. హ్యామర్ త్రో విభాగంలో సురేందర్ అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా స్విమ్మింగ్ పోటీల్లో మరో క్రీడాకారుడు కాంస్య పతకాన్ని సాధించి కమిషనరేట్‌కు కీర్తి తెచ్చారు. విజేతలను టీం మేనేజర్ నాగయ్య ప్రత్యేకంగా అభినందించారు.












