చెకుముకి మాస పత్రికలను గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులుకు అందించిన.
-ప్రజా వైద్యశాల డాక్టర్. కె మోహన్ రావు
విద్యార్థులలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించి, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించ డానికి చెకుముకి పుస్తక పఠనం బాగా ఉపయోగపడుతుందని, ప్రతి విద్యార్థి చిన్నప్పటినుండే సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా కావాలని ఆకాంక్షతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న విద్యార్థి చెకుముకి మాస పత్రికల ను జిల్లా కేంద్ర గ్రంధాలయానికి మరియు శాఖ గ్రంధాలయాలకి విరాళంగా అందించారు.ఈ కార్య క్రమంలో జిల్లా గ్రంధాలయ కార్య దర్శి ,మనోజ్ కుమార్, లైబ్రేరియన్ రామాంజనేయులు,జె జె వి ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి , రిటైర్డ్ మండల విద్యాధికారి స్వామి, దామోదర్ గారు పాల్గొన్నారు.












