మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన వార్డు ఇంచార్జిలు...
ప్రజా గొంతుక జనగామ మున్సిపాలిటీ 22వ వార్డ్ కౌన్సిలర్ జనగామ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా విజయోత్సవం ర్యాలీలో వార్డు ఇన్చార్జిలు గంగరబోయిన మహేందర్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, కొక్కలకొండ బాబు, బందారం క్రాంతి పాల్గొని శాలువలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు ,కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వార్డులో ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ఇంచార్జ్ గంగరబోయిన మహేందర్, కోక్కలకొండ బాబు, నిమ్మ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మాపై బాధ్యత ఉంచి వార్డు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన కొమ్మూరి ప్రతాపరెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి లకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా వారు హామీలు నెరవేరుస్తారని తెలియజేశారు.












