E-PAPER

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చూపాలి

Date : 17 February 2026, 5:33 pm Posted By : PRAJA GONTHUKA

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చూపాలి

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చూపాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS

(ప్రజా గొంతుక డెస్క్)

(ఫిబ్రవరి:17)

నాల్గవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. రేపటి నుండి సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రారంభమయ్యే తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో, క్రీడా గ్రామంలో ఎగురవేసే వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడా పతకాన్ని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, క్రీడాకారులతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారి చేతుల మీదుగా ట్రాక్ సూట్ తో పాటు స్పోర్ట్స్ షూ, టీ షర్ట్ అందజేశారు.

ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ క్రీడా కారులు తమ సత్తా చూపాలని, పోలీసులు శాంతి భద్రతల్లోనే కాదు క్రీడల్లో కూడా రాణించగలరని, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి శాఖపరమైన గుర్తింపు వుంటుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసీపి నాగయ్య, ఆర్.ఐ సతీష్, ఆర్. ఎస్.ఐ శ్రవణ్ కుమార్, క్యాంపు క్లర్క్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్