E-PAPER

22 వార్డు ప్రజలకు రుణపడి ఉన్నాం.

Date : 17 February 2026, 4:54 pm Posted By : PRAJA GONTHUKA

22 వార్డు ప్రజలకు రుణపడి ఉన్నాం.

22 వార్డు ప్రజలకు రుణపడి ఉన్నాం.....

క్లస్టర్ ఇంచార్జిగా బాధ్యత తో పని చేసాం...

సర్పంచ్ల ఫోరం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ మున్సిపాలిటీలో 22వ వార్డు ప్రజలకు రుణపడి ఉన్నామని క్లస్టర్ ఇంచార్జ్, సర్పంచుల ఫోరం బచ్చన్నపేటమండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు అన్నారు. జనగామ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పల్లా నివాసం ఉంటున్న ఏరియాలో బిఆర్ఎస్ నాయకులు చాలెంజిగా తీసుకొని గట్టి పోటీ గా ఉన్న సమయంలో యువజన నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో వార్డులో ఉన్న ప్రజలను కలుస్తూ ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఈ ప్రభుత్వంతోనే ఈ వార్డు అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తూ నేడు మున్సిపల్ చైర్మన్ పదవి 22వ వార్డు నుంచి గెలిచిన కడకంచి బాలమణి శ్రీనివాస్ దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని , కాంగ్రెస్ పార్టీ పై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో మున్సిపాలిటీ రూపురేఖలు మారబోతున్నాయని, ఈ విజయంతో కార్యకర్తలలో జోష్ నిండిందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలిచిన మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కౌన్సిలర్లు అండాలు, మంత్రి సుమలత లను కలిసి శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఇజ్జగిరి నరేష్,అరేళ్ళ భాస్కర్,చల్ల సురేందర్ రెడ్డి, కొయ్యడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

22 వార్డు ప్రజలకు రుణపడి ఉన్నాం…..

క్లస్టర్ ఇంచార్జిగా బాధ్యత తో పని చేసాం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్