పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. "తోర్నాల గ్రామ సర్పంచ్ చొప్పరి రాము"
(ప్రజాగొంతుక.రిపోర్టర్.బాలకృష్ణ)ఫిబ్రవరి15::మద్దూరు(దూల్మిట్ట)
గ్రామంలో నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సిద్ధిపేట జిల్లా, దూల్మిట్ట మండలం, తొర్నాల గ్రామ సర్పంచ్ చొప్పరి రాము అన్నారు. సోమవారం పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత మెగా పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చొప్పరి రాము మరియు ఉప సర్పంచ్ ఆకుల లలిత ప్రారంభించారు. బాగంగా వారు మాట్లాడుతు, పశువుల ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సన్నజీవాల కాపరులు తమ జీవాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం పశువైద్య నిపుణులు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి నట్టల నివారణకు ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ఎండి సౌజిత్ మరియు నితిన్, పాడి రైతులు, గోపాలమిత్ర సూపర్వైజర్ సాదుల్ల, గోపాల మిత్రులు రాములు, ఆంజనేయులు, రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.












