8,9,10 కౌన్సిలర్లకు రామాలయంలో ఘన సన్మాన కార్యక్రమం.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణ కేంద్రంలోని రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 8వ వార్డ్, 9 వ వార్డ్, 10 వ వార్డ్ కౌన్సిలర్లకు వాయునందన వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ గా గెలిచిన వీరబత్తిని సదానందం మాట్లాడుతూ నన్ను గెలుపు బాటలో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 9వ వార్డులో ఉన్న సమస్యల గురించి కమిటీ సభ్యులు వివరించడం జరిగింది. అనంతరం సదానందo మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని వార్డులో ఉన్న సమస్యలన్నిటిని తప్పకుండా తీరుస్తానని, ఏ ఇంటికి ఆపద వచ్చిన ముందు ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వైకుంఠం రాజు, ఇల్లటం పెంటయ్య, గండ్ర శ్రీధర్,చెన్నూరు నరేష్, చెన్నూరి సూరజ్, చెన్నూరి అఖిల్, కొక్కుల నేత్ర, తాటి సాయి, థౌట సురేష్,వేముల శివ కుమార్, థౌట సాయి (పింకు ), వీరబత్తిని నవీన్, వినయ్ కుమార్,












