అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ రామ మందిరంలో మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని నెక్కొండ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని
కన్నుల పండుగగా నిర్వహించారు
నెక్కొండ ప్రజలందరినీ ఆడబిడ్డలను చల్లగా చూడాలని వేడుకున్నారు
చిన్న కొర్పోల్ గ్రామ సర్పంచ్ భానోత్ అనిత బద్రు నాయక్ శివయ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు
ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శివపార్వతులను వేడుకున్నారు ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత స్వామి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో మహిళలు భక్తులు యువకులు పాల్గొన్నారు శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు
శివపార్వతుల కళ్యాణం తిలకించడానికి మహిళలు ఉపవాస దీక్షలు చేస్తూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తుల కోర్కెలు తీర్చాలని
చల్లగా చూడమని వేడుకున్నారు
అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతుల నడుమ కన్నుల పండుగగా జరిగిన శివయ్య పార్వతమ్మ కళ్యాణ మహోత్సవం













