మాధవ రెడ్డికి బీసీలు సరైన గుణపాఠం చెప్పారు...
బిఆర్ఎస్ వైఖరి ప్రజలకు తెలిసింది...
ఓబీసీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బీసీ రిజర్వేషన్ కు అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేసిన మాధవరెడ్డికి బీసీ నాయకులు సంఘాలు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని జనగామ జిల్లా ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ అన్నారు. నిన్నటి మున్సిపల్ ఫలితాల్లో మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోటీచేసిన మాధవరెడ్డికి అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. బీసీ రిజర్వేషన్ ప్రక్రియకు అడ్డుకున్న వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవకాశం ఇచ్చిందని, ఆ పార్టీ వైఖరికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. అతనికి బీఫామ్ ఇచ్చి ఎలక్షన్లలో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన బిఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేయడానికి అతని వెనకాల ఉన్నది టిఆర్ఎస్ పార్టీ అని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టాం కట్టారని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గుర్తించి ఓటు వేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు నిరుపేదలకు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని, ఇలాంటి వ్యక్తులకు ఎప్పటికీ ప్రజలు బుద్ధి చెప్తూనే ఉంటారని ఇది ఒక ఉదాహరణ అని అన్నారు.












