*అమీనాబాద్ మోడల్ స్కూల్‌లో ఆరు నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్ నోటిఫికేషన్*.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి , ( ప్రజా గొంతుక న్యూస్) , 13 ఫిబ్రవరి 2026 .
అమీనాబాద్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష వివరాలు తెలియచేసిన మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు.
వరంగల్ జిల్లా , చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ మోడల్ స్కూల్‌లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 28-01-2026 నుండి ప్రారంభమైందని, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్ట జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని విద్యార్థిని విద్యార్థులు అమీనాబాద్ మోడల్ స్కూల్ కి వచ్చి స్వయంగా మీరు పాఠశాలలోని అన్ని రకాల ల్యాబ్ లను , గ్రంథాలయాన్ని కంప్యూటర్ ల్యాబ్ ను , లాంగ్వేజ్ ల్యాబ్ ను, మ్యాథమెటిక్స్ ల్యాబ్ ను ,ఒకేషనల్ ల్యాబ్ లను సందర్శించి మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో , ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు వస్తున్నాయి .
ఆ ఫలితాల కూడా మీరు పాఠశాలకు వచ్చి తెలుసుకోవచ్చు.
అమీనాబాద్ మోడల్ స్కూల్ పిఎం శ్రీ మోడల్ స్కూల్ గా సెలెక్ట్ అయినందుకు, గత సంవత్సరము నుండి బాలికలకు ప్రత్యేక కరాటే తరగతులు, యోగా తరగతులు మరియు సంగీత తరగతులు, ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి చెప్పించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా విద్యార్థిని విద్యార్థుల అందరిని విహార యాత్రలకు కూడా తీసుకోవడం జరుగుతున్నది.
ఈ నోటిఫికేషన్ ద్వారా
ఆరో తరగతిలో 100 సీట్లు,
ఏడు నుంచి పదవ తరగతుల్లో మిగిలిన ఖాళీ సీట్లకు
అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28-02-2026
దరఖాస్తు రుసుము:
ఎస్సీ , ఎస్టి , బీసీ , ఈ డబ్ల్యూ ఎస్, పిడబ్ల్యుడి అభ్యర్థులకు: రూపాయలు 125 ,
ఓసి అభ్యర్థులకు: ₹200.
ప్రవేశ పరీక్ష తేదీ: 19-04-2026
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే అమీనాబాద్ మోడల్ స్కూల్‌లో కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు.
ఆంగ్ల మాధ్యమంలో అత్యుత్తమ సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న మోడల్ స్కూల్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక వరంగా నిలుస్తుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.












