షాద్‌నగర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దే
మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ – 15 సీట్లతో స్పష్టమైన మెజారిటీ
28 వార్డుల్లో 15 స్థానాలు గెలుపు
పట్టణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం
ప్రజా గొంతుక.షాద్‌నగర్,
షాద్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 28 వార్డుల్లో 15 స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్‌ను దాటడంతో అధికారాన్ని దక్కించుకుంది.ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల పోరులో చివరి వరకు టెన్షన్ నెలకొన్నప్పటికీ, ఫలితాల వెలువడిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. 15 సీట్లు సాధించడం ద్వారా మున్సిపాలిటీపై పూర్తి పట్టును సాధించినట్టైంది. కార్యకర్తలు, నాయకులు విజయోత్సవాలు నిర్వహిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారం తమ ప్రధాన అజెండా అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి పట్ల నమ్మకంతో తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు.మరోవైపు భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు గణనీయమైన స్థానాలు సాధించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీ మాత్రం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఈ ఫలితాలతో షాద్‌నగర్ పట్టణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. చైర్పర్సన్ పదవి కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.













