పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడంలో కాంగ్రెస్ కే సాధ్యం
ప్రజా గొంతుక చేర్యాల: మండలంలోని కడవేరుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని గురువారం జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ నాయకులతో కలిసి నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభోత్సవ చేసినారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం మనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని. ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా నిజమైన అర్హులకు గౌరవప్రదమైన నివాసాన్ని అందించడం జరుగుతోంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, కడవేరుగు గ్రామ సర్పంచ్ తాళ్ళపల్లి రమేష్, గ్రామశాఖ అధ్యక్షులు బాలచంద్రం, యూత్ కాంగ్రెస్ నాయకులు వినీత్ బాబు, మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












