మిర్యాలగూడ మార్కెట్ యార్డ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ...........
సహాయ జిల్లా ఎన్నికల అధికారి &
మున్సిపల్ కమిషనర్
హాలియా మున్సిపాలిటీ
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:12
హాలియా మున్సిపాలిటీ – 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026
ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహణ – సమాచారం
హాలియా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం రేపు ఉదయం మిర్యాలగూడ మార్కెట్ యార్డ్‌లోఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించబడుతోంది.ఈ సందర్భంగా హాలియా మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేసిన అన్ని అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు మరియు గుర్తింపు పొందినవారు రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు రేపు ఉదయం 06:30 గంటలలోపు కౌంటింగ్ కేంద్రానికి హాజరు కావాల్సిందిగా తెలియజేయబడింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పారదర్శకంగా నిర్వహించబడును.
కౌంటింగ్ ప్రవేశం పొందేందుకు సంబంధిత గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకు రావలసిందిగా సూచించడమైనది.
ఈ మేరకు అన్ని అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.












