*- పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్*
*- పద్మ వెంకటేష్ నాయక్*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతువాణిపల్లి గ్రామంలో నేడు పాఠశాలల్లో మధ్యా హ్న భోజనాన్ని పరి శీలించిన అనంతరం సర్పంచ్ పద్మా వెంకటేష్ నాయక్ లు మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం మరియు వారంలో గుడ్లు తప్పనిసరి అందియాలని అన్నారు. అలాగే విద్యార్థిని విద్యార్థులతో కూర్చొని సర్పంచు పద్మ వెంకటేష్ నాయకులు భోజనం చేశారు. మరియు పాఠశాల ఆవరణలో రోజువారీగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలన్నారు. పాఠశాలకు సంబంధిం చినయోగక్షేమాలుప్రధానోపాధ్యాయురాలు సత్యమ్మను అడిగి తెలుసుకున్నారు.












