ఓటు హక్కును వినియోగించుకున్న సింధు,బిందు
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణానికి చెందిన పుట్టకావేరి- రాజు ఇద్దరు కూతుర్లు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ సందర్భంగా చేర్యాలలో మున్సిపల్ జరుగుతున్న నేపథ్యంలో పట్టణానికి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్ద కూతురు బిందు గుజరాత్ రాష్ట్రంలోని పీజీ సెకండియర్ చదువుతున్నది. చిన్న కూతురు సింధు చెన్నైలో బయో మెడికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని రాజ్యాంగంలో ఓటు హక్కు విలువైందని తెలిపారు. అంతేకాకుండా మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించడం వల్ల వారికి సంతోషంగా ఉందని తెలిపారు.












