E-PAPER

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్….83.41శాతం నమోదు

Date : 11 February 2026, 7:23 pm Posted By : PRAJA GONTHUKA

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్….83.41శాతం నమోదు

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్....83.41శాతం నమోదు

ప్రజా గొంతుక చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉదయం నుండే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు, 24 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 13777 మంది ఓటర్లు ఉన్నారు.వీరిలో పురుషులు 6658 మంది,మహిళలు 7119 మంది ఉన్నారు. పోలింగ్ పూర్తయ్యేవరకు మొత్తంగా 11491 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.వీరిలో పురుషులు 5626 మంది,మహిళలు 5865 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేర్యాలలో 83.41 పోలింగ్ శాతం నమోదయ్యింది.ఇక ఫలితాలు ఈ నెల 13వ తేదీన వెలువడనున్నాయి. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.ప్రధాన పార్టీలైనా బీజేపీ, బిఆర్ఎస్,కాంగ్రెస్ అభ్యర్థుల భవిత్యం ఎలా ఉండబోతుందో , ఓటర్లు తమ ఓటు ద్వారా ఇచ్చే తీర్పు ఎలావుంటుందో 13 వ తేదిన వెలువడే ఫలితాల్లో ఏర్పడనుంది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్