*-దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదంచేయండి.*
*- గద్వాల జిల్లా కార్మిక సంఘాలు*
*- జిల్లా కార్మిక అధ్యక్షులు నరసింహ*
జోగులాంబ గద్వాల జిల్లా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయ ప్రదం చేయాలని సిఐటీయూ, టి యు సి ఐ, ఐఎఫ్టియు జిల్లా అధ్య క్షులు ఉప్పేర్ నరసింహ, సి.హను మంతు, జమ్మిచెడు కార్తీక్ కార్మికవర్గానికిపిలుపునిచ్చారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటీయు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో వారు పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న 10 కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఈ సమ్మె జరుగుతుందని సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని బిజెపి అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేయాలని కోరా రు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉత్పత్తి చేసిన సంపద శ్రమజీవులకే దక్కా లని, సంపదనువికేంద్రీకరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఆపాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సో ర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి ప్రతి ఒక్క కార్మికుని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని, అంతవరకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, కార్మికులు ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని, విత్తన విద్యుత్ బిల్లులకు సవరణలు ఆపాలని, తదితర అనేక డిమాండ్లతో ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన గత 12 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ, పేద మధ్య తరగతి, కార్మికులకు వ్యతిరేకమైన విధానాల అనుసరిస్తున్నదని తెలిపారు. కార్మికులకు భద్రత కల్పించకుండా, సంక్షేమాలు అమలు చేయకుండా నిర్బంధ నియంతృత్వ దౌర్జన్యపూరిత విధానాలతో శ్రమ దోపిడిని నిరాటంకంగా కొనసాగించడానికి చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగానే ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12 నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మె చారిత్రాత్మకమైనదని, ఈ సమ్మెల ప్రతి కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కృష్ణ, హలీం పాషా లు పాల్గొన్నారు.

*- గద్వాల జిల్లా కార్మిక సంఘాలు*










