పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సిపి
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
(10)
రేపు జరిగే మున్సిపల్ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పొలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు
ఈ సందర్బంగా పోలింగ్ సామగ్రి పంపిణీ జరుగుతున్న తీరుపై పోలీస్ సంబంధిత అధికారులను వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఇదే కళాశాలలో ఏర్పాటు ఎన్నిక లెక్కింపు కేంద్రాలతో పాటు, బ్యాలేట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను పోలీస్ కమిషనర్ అడిషినల్ కలెక్టర్ పింకేష్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలసి పరిశీలించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లపై పోలీస్ సంబంధిత రెవేన్యూ అధికారులకు పలు సూచనలు చేయగా, లెక్కింపు సజావుగా కోనసాగేందుకు తీసుకోవాల్సిన ముందస్తూ జాగ్రత్త చర్యలపై పోలీస్ కమిషనర్ ఘన్పూర్ ఏసిపి భీం శర్మకు ఆదేశాలు జారీచేసారు. అదే విధంగా బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చే స్ట్రాంగ్ రూంలను సైతం పోలీస్ కమిషనర్ పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు జరిగే ఎన్నికలను సజావుగా, ప్రశాంతవంతమైన వాతవరణం నిర్వహించేందుకుగా అధికారులందరు సన్నద్దం కావాలని, ఎవరైన ఎన్నికల నియమాలను అత్రికమించకుండా జాగ్రత్త పడాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ వెంట స్థానిక ఏసిపి అనంతయ్య , ఇన్స్‌స్పెక్టర్లు వేణు, శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్ తో పాటు ఎస్.ఐలు ఇతర పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు












