*సంగీత సాహిత్య సుధావాహిని సంస్థ ఆధ్వర్యంలో పద్య లీల గానహేల కార్యక్రమం*
ప్రజా గొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి: మంచిర్యాల జిల్లా సీఎంఆర్ కాంప్లెక్స్ సుచిత్ర ఇన్ సెల్లార్ లో ఆదివారం "సంగీత సాహిత్య సుధా వాహిని సంస్థ" ఆధ్వర్యంలో
"పద్య లీల గానహేల" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ప్రముఖ వాగ్గేయకారులు పొనకంటి దక్షిణామూర్తి గారిచే విలక్షణ సాంప్రదాయ లలిత, జానపద,సినీ,గేయ, శాస్త్రీయ, పద్య రాగావధాన కార్యక్రమము నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సాహిత్య,కళా పిపాసకులు,కవులు,కళాకారులు సాహితీ,కళాపోషకులు, అభిమానులు హితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశం గౌడ్ ప్రచార కార్యదర్శి నోముల చంద్రశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.












