స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గమే నా కుటుంబం
ప్రజా గొంతుక డెస్క్
ఫిబ్రవరి (09)
నా లక్ష్యం, నా ఆలోచన నియోజకవర్గ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం మాత్రమే
మీ ఆశీర్వాదంతోనే 30ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నాను
మీరు ఇచ్చిన మద్దతుతోనే ఈ రోజు కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్
ఎన్నికలు వచ్చాయని ఓట్లు వేయమని వస్తున్నారు
బిఆర్ఎస్, బిజీపిలతో అభివృద్ధి జరగదు
బిఆర్ఎస్, బీజేపీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే
రాజయ్య 15ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎం చేశాడు
అధికారంలో ఉన్నప్పుడే ఎం చేయలేదు ఇప్పుడు ఎలా చేస్తాడు...
నన్ను తిట్టడానికే బిఆర్ఎస్ పార్టీ రాజయ్య ను కూలీగా పెట్టుకుంది...
ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం కావాలి...
11న జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి...
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ప్రజలు అలోచించి ఓటు వేయాలని, మీరు వేసే ఓటు అభివృద్ధికి ఉపయోగపడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ శివునిపల్లి పరిధిలోని 2,3,4,5, మరియు చాగల్ పరిధిలోని 6,7,8,9 వార్డులలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పాలకరిస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు..
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గమే నా కుటుంబం అని నాకున్న ఏకైక లక్ష్యం, నా ఆలోచన అంతా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం మాత్రమే అని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తోనే 30ఏళ్లుగా రాజకీయాలలో ఉంటున్నానని తెలిపారు. మీ మద్దతుతోనే కడియం శ్రీహరి అనే వ్యక్తి నీతి నిజాయితీకి మారుపేరుగా ఉండగలుగుతున్నని అన్నారు. 30ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ నిజాయితీగా పని చేస్తున్నాని వెల్లడించారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది అని చెప్పుకునే విధంగానే నా పని తీరు ఉంటుందని పేర్కొన్నారు.
స్టేషన్ ఘనపూర్, శివునిపల్లి, చాగల్ గ్రామాలలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయని గత 15ఏళ్ళు ఎమ్మెల్యే గా ఉన్న రాజయ్య ఒరగబెట్టింది ఏమి లేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిని మరిచి చిల్లరపనులు, చిలిపి చేష్టలతో నియోజకవర్గ పరువు తీసి చెడ్డ పేరు మాత్రం తెచ్చాడని ఆరోపించారు. పనులు అమ్ముకున్నాడు, పదవులు అమ్ముకున్నాడు, పథకాలు అమ్ముకున్నాడని అలాంటి వ్యక్తిని నమ్మి ఓటు వేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. బిఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం వస్తున్నారని వాళ్లకు ఓటు వేస్తే మురుకి కాలువలో వేసినట్లే నని తెలిపారు. బీజెపికి తెలంగాణపై ప్రేమ లేదని తెలంగాణ ఏర్పడి 12ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇచ్చింది లేదు, నిధులు మంజూరు చేసింది లేదని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని ఆక్షేపించారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి 1400కోట్ల నిధులు తీసుకువచ్చానని తెలిపారు. నేడు గ్రామ గ్రామాన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఘనపూర్, శివునిపల్లి, చాగల్ గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీ చేసానని ఇప్పుడు ఘనపూర్ మున్సిపాలిటీని మాడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన ఘనపూర్ మున్సిపాలిటీలోని సమస్యలను ముఖ్యమంత్రి గారికి వివరించాగానే తక్షణమే 50కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే 25కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు. మరిన్ని అభివృద్ధి పనులు జరగలాన్నా, మీ వార్డులలో సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని అన్నారు. కావున ఘనపూర్ మున్సిపాలిటీ ప్రజలు అలోచించి ఓటు వేయాలని మీరు వేసే ఓటు అభివృద్ధికి ఉపయోగపడాలని కోరారు. 11వ తేదీన జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కాంగ్రెస పార్టీ అభ్యర్థులు, వార్డు ఇంచార్జ్ లు, పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












