11వ వార్డ్ అభ్యర్థి కర్రే రమేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిఎస్పి పార్టీ విజ్ఞప్త
ప్రజా గొంతుక ప్రతినిధి /
పరకాల (ఫిబ్రవరి09)
హనుమకొండ జిల్లా పరకాల పురపాలక సంఘం మునిసిపల్ ఎన్నికలలో తొలిసారిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 11వ వార్డ్ అభ్యర్థిగా కర్రే రమేష్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, మాత రమాబాయి అంబేద్కర్ నుండి మనం నేర్చుకోవలసింది గౌరవం, సమానత్వం, విద్య, స్వాభిమానం అని తెలిపారు. విద్యనే మన జీవితాన్ని మార్చే ఆయుధమని, చదువుతోనే మన స్థితి మారుతుందని, ఆత్మగౌరవంతో జీవించాలని, ఎవరికీ తక్కువగా అనిపించకుండా నిలబడాలని పిలుపునిచ్చారు.
సమాజ సేవ చేయడం, బలహీన వర్గాల కోసం పనిచేయడం, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం, సమానత్వం–న్యాయం–మానవత్వం కోసం పోరాడడం తన లక్ష్యమని తెలిపారు. కుటుంబ బాధ్యతలను మౌనంగా భరించిన మాత రమాబాయి అంబేద్కర్ గారి త్యాగాన్ని గుర్తు చేస్తూ, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడి సమాజ సేవ చేసిన ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ ఆశయాలతో 11వ వార్డ్ అభ్యర్థిగా ప్రజలకు విద్య, సమానత్వం, సమన్యాయం అందించే విధంగా నిష్పక్షపాతంగా సేవ చేస్తానని తెలిపారు. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం, సహకారం కోరుతూ, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.












