కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కొనసాగిన ప్రచారం...
ప్రజలు ఆశీర్వదించి పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
ఓబీసీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్
ప్రజా గొంతుక జనగామ మున్సిపాలిటీ
బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు చెరుకూరి శ్రీనివాస ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని జనగామ మున్సిపాలిటీలో పదో వార్డ్ అభ్యర్థి నీరటి రజిని గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. పదో వార్డులో ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు.అధికార పార్టీలో ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ ఏ కష్టం వచ్చిన ముందుండి ఆదుకుంటారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రజలు అప్పటి ఇందిరమ్మను గుర్తు చేస్తున్నారని అన్నారు. పదో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మ చారి, మల్లవరం అరవింద్ రెడ్డి గుర్రపు బాలరాజు, గోపాల్ నగర్ వార్డ్ మెంబర్ గంగరబోయిన ఐలయ్య, అవధూత శ్రీనివాస్, సందెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












