22 వార్డులో ప్రచారంలో దుమ్ములేపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ని....
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు...
గెలుపు దిశగా జోరుగా ప్రచారం
22వ వార్డు అభ్యర్థి కడకంచి బాలమణి శ్రీనివాస్
ప్రజా గొంతుక జనగామ మున్సిపాలిటీ
సోమవారం 22 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడకంచి బాలమణి శ్రీనివాస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
22వ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి సొంత నిధులతో అభివృద్ధి చేసి సమస్యలను లేకుండా చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి22వ వార్డు అభ్యర్థి కడకంచి బాలమణి శ్రీనివాస్ అన్నారు. వారు ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో అడుగడుగున సమస్యలున్నాయి గత పాలకులు ఏమి అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా అడిగారు. తాము గెలిస్తే సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని, ప్రజలు గుర్తించి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి ఓటు వేస్తే మన వార్డు అభివృద్ధి చెంది మరింత ముందుకు వెళ్తూ ఆదర్శ అవార్డుగా తీర్చేదిద్దే బాధ్యత నేను తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.












