*నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి వి. విష్ణు బాబు ( ప్రజా గొంతుక న్యూస్ ) , 08 ఫిబ్రవరి 2026.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా , రోడ్ షోలో పాల్గొన్న సందర్భంగా , బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ,
నర్సంపేట అంటేనే పోరాటల గడ్డ అని , ఉద్యమాల అడ్డా అని వివరించారు.
ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నాం.
హామీల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్
తులం బంగారం ఇస్తాన్నన్నారు, రాలేదు.
4000 పెన్షన్ ఇస్తాన్నన్నారు, రాలేదు .
బతుకమ్మ చీర రాలె...
రంజాన్ తోఫా రాలె...
సకాలంలో రైతులకు యూరియా రాలె...
డిసెంబర్ లో ఇవ్వవలసిన రైతు బందు
పీబ్రవరి వచ్చిన రైతు బంధు రాలె...
మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని దొంగ హామిలే.
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్.
ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అని వివరించారు.












