మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ.
ప్రజా గొంతుక కొమురవెల్లి : ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో గంగ రేణి చెట్టు వద్ద వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి పట్నాలు వేసుకున్నారు. డబ్బు చప్పుల దరువులు శివసతుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు భక్తుల జయజయద్వానాలతో మల్లన్న నామస్మరణతో కొమురవెల్లి ఆలయ ప్రాంతం భక్తులతో కిటికీటలాడిది. జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉగాది పర్వదినం వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. మల్లన్న ఆలయానికి వచ్చిన భక్తులు పట్టాల సమర్పించడంఆనవాయితీగా వస్తుంది. స్వామి వారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.












