అనాథగా 'పల్లి శ్రీనివాస్' అంత్యక్రియలు!
అందరూ ఉండి కిరాయి మనుషులతో తలకొరిమి
ప్రజా గొంతుక న్యూస్ ఫిబ్రవరి 8/ రుద్రంపూర్: మనుషుల మధ్య మమకారం చచ్చిపోతోంది.. రక్తసంబంధాల కంటే ఆస్తి పాస్తులే మిన్న అనే దౌర్భాగ్య స్థితికి సమాజం చేరుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీలో జరిగిన పల్లి శ్రీనివాస్ అంత్యక్రియలే దీనికి నిదర్శనం.
భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ ఒంటరితనంతో మద్యానికి బానిసైన శ్రీనివాస్ శనివారం మరణించారు. కన్నకొడుకు తండ్రిని చూడటానికి రాకపోగా, చివరకు తలకొరిమిపెడటానికి కూడా రాలేదు. తమ్ముడి తమ్ముడు కొడుకు అయిన తలకొరిమి పెడతాడు అనుకుంటే "ఆస్తి పంపకాలు తేలితేనే తలకొరివి పెడతా" అని భీష్మించుకు కూర్చున్నాడు. వారసులుగా ఉన్న తమ్ముళ్లు పంపకాలకు నిరాకరించడంతో గొడవ ముదిరింది. చివరకు కుల సంఘాలు కూడా పట్టించుకోకపోవడంతో, ఆస్తి వివాదాల మధ్య శ్రీనివాస్ మృతదేహం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
తండ్రి కడచూపుకు నోచుకోని వైనం.
తలకొరివి పెట్టడానికి ఆస్తిని షరతుగా పెట్టిన తమ్ముడి కొడుకు.
కిరాయి మనుషులతో అంత్యక్రియలు:
చివరకు తోబుట్టువులే కిరాయి మనుషులను పిలిపించి అంత్యక్రియలు పూర్తి చేయడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేసింది.
కోట్లు ఉన్నా, కొడుకులు ఉన్నా.. చివరికి శ్రీనివాస్ అనాథగానే వెళ్ళిపోయారు. ఆస్తి కోసం ఆత్మీయతను












