మల్లన్నను దర్శించుకున్న రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ మెంబెర్ భవాని రెడ్డి.
ప్రజా గొంతుక కొమురవెల్లి : ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర అగ్రికల్చర్ కమిటీ సభ్యులు భవాని రెడ్డి కుటుంబ సభ్యులతో కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు వేదా ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదం మరియు శేష వస్త్రంను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని శ్రీనివాస్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












