E-PAPER

*-కార్మిక చట్టాలను యధాతథంగా అమలుచేయాలి.* 

Date : 07 February 2026, 4:07 pm Posted By : PRAJA GONTHUKA

*-కార్మిక చట్టాలను యధాతథంగా అమలుచేయాలి.* 

*-కార్మిక చట్టాలను యధాతథంగా అమలుచేయాలి.*

 *-కార్మిక చట్టాలను యధాతథంగా అమలు చేయాలని.*

*సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ అన్నారు*.

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని శనివారం గద్వాల మండలం లోని తుర్కొని పల్లి, ముల్కలపల్లి, తెలుగోనిపల్లి, లత్తిపురం గ్రామాలలోసమ్మెప్రచారంనిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేసి,వాటి స్థానంలో కార్మిక హక్కులు హరించే పారిశ్రామిక సంబం ధాలకోడ్2020,ఆక్యుపెషనల్ సేఫ్టీ,హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020, సాంఘిక భద్రతా కోడ్ 2020, వేతనాల కోడ్ 2019 వంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు. ఈ కోడ్ లు అమలు లోకి వస్తే కార్మికులకు పనికి హామీ, భద్ర త,కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం,పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు ,వంటివి అమలు కావని అన్నారు. ఉత్పత్తికి మూలమైన కార్మిక వర్గ హక్కులు ఉండాలంటే పాత చట్టా లనే కొనసాగించాలన్నారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను సైతం కారుచౌకగా పెట్టుబడి దారులకు అప్పచెప్పుతూ కార్మిక, ప్రజాతంత్ర హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ జరగాలంటే కార్మిక చట్టాలను యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక వర్గం హక్కు లపై గళ మెత్తకుండా ఉద్దేశపూర్వకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేస్తున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయ డానికి తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు వెంకటేష్,సోమేశ్వరీ ప్రసాద్, హనుమంతు ,మన్నెమ్మ, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్