ఒక్కసారి అవకాశం ఇవ్వండి 4 వ వార్డు అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తా....
కాంగ్రెస్ పార్టీ 4 వ వార్డుకౌన్సిలర్ అభ్యర్థి.... మంద విజయలక్ష్మి నర్సిరెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:07
హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని 4వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంద విజయలక్ష్మి నర్సిరెడ్డి అన్నారు. శనివారం ఆయన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డిలు తనకు టికెట్ ఇచ్చారని అన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలు అన్నిటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు., మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












