*-అయిజ కేంద్రంలో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో .*
*-128 వ త్యాగాలా తల్లీ రామాబాయి అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన నాయకులు.*
*-14 వ వార్డ్ బిఎస్సీ అభ్యర్థి రాజరత్నం.*
*-15 వ వార్డ్ బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ*.
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రం బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో త్యాగాల తల్లి మాత రమాబాయి అంబేడ్కర్"128 వ జయంతి ఘన నివాళులర్పించిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు, మని కుమార్, బండారి ఎస్ రాజ్, రేపల్లె రాజు వారు మాట్లాడుతూ...బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఎంతో గొప్ప వ్యక్తికి భార్య అయినా తల్లిరామాబాయి కి మాత్రం కష్టాలు తప్పలేదు,పిల్లల పోషణ వారి ఆరోగ్య సమస్యలు అనుకున్న సమయాలలో వైద్యం అందక తన కడుపున పుట్టిన నలుగురు బిడ్డలను పోగొట్టుకొని అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న కూడా మెక్కోవని ధైర్యంతో ముందుకు నడిచింది కానీ భయంతో బాధ్యతలు నుండి మాత్రం తప్పుకోలేదు ఈ తల్లి లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయేవారు కాదని సందర్భంగా వాళ్లు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు మని కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఎస్, రాజు , జిల్లా ప్రధాన కార్యదర్శి, రేపల్లె రాజన్న , బహుజన రాజ్యసమితి నాయకులు వినోద్, మరియు నాయకులు పాల్గొన్నారు












