హాలియా మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఏర్పాటు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా
తేదీ: 06.02.2026
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మరియు జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు, హాలియా మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ వర్గానికి చెందిన అర్హులైన ఓటర్ల కోసం హాలియా మున్సిపాలిటీ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయబడినది.
ఈ ఫెసిలిటేషన్ సెంటర్ క్రింది తేదీలలో పనిచేయును:
07.02.2026 ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు
08.02.2026 ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం, అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. శాంతి భద్రతల దృష్ట్యా తగిన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడింది.
అదేవిధంగా, ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహణ విషయమై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మరియు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముందస్తుగా సమాచారం అందించబడినది.
ఇంకా, మున్సిపల్ ఎన్నికల విధుల్లో నియమితులైన పోలింగ్ సిబ్బంది, జోనల్ అధికారులు మరియు ఇతర ఎన్నికల డ్యూటీలో ఉన్న సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవలసిందిగా కోరడమైనది.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తయిన అనంతరం, బ్యాలెట్ బాక్స్‌ను నిబంధనల ప్రకారం సీలు చేసి, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు భద్రపరచుటకు అవసరమైన చర్యలు తీసుకోబడును.
ఈ సమాచారాన్ని గమనించగలరు.
జారీ చేసిన వారు
అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి &
మున్సిపల్ కమిషనర్
హాలియా మున్సిపాలిటీ
నల్గొండ జిల్లా












