*మునేష్ ఆరోగ్యం మెరుగుపడాలి 10,000/-రూ ఆర్థిక సహాయం అందజేసిన కుండే కుమార్*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఫిబ్రవరి 06:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన బలిజ లింగమ్మ పెద్ద కుమారుడు మునేష్ అనారోగ్య కారణం వల్ల గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.. గ్రూపులో ఆర్థిక సహాయం కావాలని పోస్టు చేయడంతో వెంటనే స్పందించిన బిజెపి పార్టీ రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుండే కుమార్ కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది గ్రామంలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తానని కుమార్ తెలియజేశారు.. వెంటనే స్పందించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినందుకు గ్రామ ప్రజలు కుండే కుమార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు
అనంతరం కుండే కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యల పట్ల.. గ్రామం పెద్దదిగా మారిపోయింది. బైక్ లో మరియు కార్లు వేగంగా వెళుతున్నాయి ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఇంకా ప్రమాదాలు జరగకముందే గ్రామంలో స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా గ్రామంలో బస్సు సెంటర్ లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు . చలికాలం గడిచిపోయింది వచ్చే ఎండాకాలంలోపు బస్సు సెంటర్ ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళలకు. కాలేజీలకు వెళ్లే చిన్నారులకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ.. అనంతరం వర్షాకాలం వస్తది కాబట్టి ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దలు మరియు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధి జరిగే విధంగా చూడాలని కుండే కుమార్ విజ్ఞప్తి చేశారు












