అత్యవసర 108 వాహనం అందుబాటు లేక..ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు...
ప్రజా గొంతుక ( ఫిబ్రవరి 6) కాల్వ శ్రీరాంపూర్ : అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన 108 సేవలు అందుబాటులో లేక, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అని విమర్శలు వినిపిస్తున్నాయి. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వెళ్లిన రోగులకు, మెరుగైన వైద్యం కోసం, జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించాలన్న అత్యవసర 108 వాహనం అందుబాటు లేకపోవడంతో, ఇతర మండలాల నుంచి సమయానికి ఆంబులెన్స్ రాకపోవడం, రోగులు దారిలోనే ప్రాణాలు కోల్పోతున్నరన్న, సమాచారం తో ప్రజలు ఆందోళన కు గురవుతూ,ఈ పరిస్థితికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమా....లేక ప్రజా ప్రతినిధుల రాజకీయ మౌనమా.?? అంటూ స్థానికులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.. ఎన్నికలో సమయంలో ఇచ్చే హామీలు, ఫ్లెక్సీలు ప్రకటనలకే పరిమితం..అవుతున్నాయి. కానీ ప్రజల ప్రాణాల విషయం లో మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. 108 కి ఫోన్ చేస్తే ఆలస్యంగా వస్తుందని, ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరాల పరిస్థితిల్లో తరలించడానికి, సమయానికి రాక ప్రమాదంలో ప్రాణాలు పోయిన వారి కుటుంబ సభ్యులు కూడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోక ముందే... ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు, స్పందించి మండల కేంద్రానికి పూర్తిస్థాయిలో 108 సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ నిర్లక్ష్యం, మరిన్ని అమాయక ప్రాణాలు బలి తీసుకునే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..












