చేర్యాలలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ...
ప్రజా గొంతుక చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోదూసుకుపోతుంది. శుక్రవారం జనగామ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పట్టణంలోని 4వ వార్డులో అభ్యర్థి వంగ జయను గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ప్రతి ఓటరును పలుకరిస్తూ, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు అందుతున్నాయని అందువలనే ప్రజలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని ఈ ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగ అయిపోతుందన్నారు.












