ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇరువురు మృతి..
ప్రజా గొంతుక ఫిబ్రవరి 5 కాల్వ శ్రీరాంపూర్ : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని, ఇరువురు మృతి చెందిన సంఘటన శ్రీరాంపూర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం సురేష్( 27)వ్యక్తిగత పనులు ముగించుకొని శ్రీరాంపూర్ నుండి, రాతుపల్లికి వెళుతుండగా,మరో ద్విచక్ర వాహనదారుడు పోత్కాపల్లి కి చెందిన పచ్చిక ఫణిందర్ రెడ్డి (28) అను అతను ఇదులాపూర్ సోలార్ ప్లాంట్ లో పని ముగించుకుని,తన సొంత గ్రామమైన పొత్కపల్లికి వెళ్తున్న క్రమంలో, తారుపల్లి, చిన్న రాతుపల్లి క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో, ఇరువురి తలకు తీవ్ర గాయాలు అవ్వగా, స్థానికుల సమాచారం మేరకుఏస్ ఐ వెంకటేష్,ఎఏస్ ఐ నీలిమ,పోలీస్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి ఇరువురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఇరువురు మృతిచెందడం తో వారి గ్రామలల్లో శోకసముద్రంలో మునిగాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఇరువురి కుటుంబ సభ్యులు చేరుకోగా ఆసుపత్రి ప్రాంగణం శోక సముద్రంతో తలపేస్తున్నాయి .సంఘటన సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....












