ఇంటింటి ప్రచారం నిర్వహించిన 8 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గౌహార్ జబీన్ మజహర్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:05
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మునిసిపాలిటీ పరిధిలోని 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గౌహార్ జబీన్ మజహర్ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, మునిసిపాలిటీ అభివృద్ధిపై తన ప్రణాళికలను వివరించారు.
వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలను పరిష్కరిస్తానని గౌహార్ జబీన్ మజహర్ హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, తమకు అవకాశం ఇస్తే 8 వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని గౌహార్ జబీన్ మజహర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అనుముల మార్కెట్ కమిటి చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, మాజి మార్కెట్ కమిటి చైర్మన్ కాకునూరి నారాయణ గౌడ్, అల్వాల్ మాజి సర్పంచ్ పాపిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్మటి వెంకట్ రెడ్డి ,ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు పాండు నాయక్, కాంగ్రెస్ నాయకులు కోట నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు












