ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య...
ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య కి పాల్పడ్డ ఘటన గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది.. ముల్కనూర్ గ్రామంలోని కొత్తపెళ్లి కుమార్ (39) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందాడు.. స్థానికులకు బావి వద్ద ఉరివేసుకొని కుమార్ కనపడడంతో గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..












