*1వ వార్డు బిజెపి కౌన్సిలర్ గుండాల పద్మ , అంజయ్య అభ్యర్థి ఇంటింటా ప్రచారం*
*ప్రజా గొంతుక ఫిబ్రవరి 6 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ ఖిల్లా నల్గొండ*
దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ లోని 1 వ వార్డు బిజెపి కమలం పువ్వు కౌన్సిలర్ అభ్యర్థిగా గుండాల పద్మ అంజయ్య పోటీ చేస్తున్నారు. కావున గురువారం రోజు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గుండాల అంజయ్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆయన వెంట నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












