కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్...
ప్రజా గొంతుక( ఫిబ్రవరి 4)కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గృహ నిర్మాణంలో పన్నుల వసూలల్లో అవగతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం తో జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ తాత్కాలిక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎం ప్రసాద్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఇంటి బిల్లులు 4,26,850 రూపాయలు వసూలు కాగా, అందులో కేవలం 01లక్ష 44,603 రూపాయలు మాత్రమే గ్రామపంచాయతీ సాధారణ నీదికి జమ చేసి, మిగిలిన2,82,247 జమ మొత్తాన్ని తన వద్దే ఉంచుకొని నిబంధనలు పాటించకుండా దుర్వినియోగం చేశారని ఆరోపణ పై సస్పెండ్ గురి అయ్యారు. అధికారులకు సమాచారం లేకుండా మండల కేంద్రం విడిచి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు స్పష్టం చేశారు.