-లెక్కింపు కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
- జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ కుమార్.
గద్వాల మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రంగా గోనుపాడు గ్రామంలో ఉన్న ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలను ఎంపిక చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుధవారం కళాశాలను సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కు ఆయా వార్డుల వారీగా అవసరమైనన్ని కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచేందుకు ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్ ను పరిశీ లించి ఎన్నికల అధికారులకు తగు సూచనలు చేశారు. కౌంటింగ్ హాల్స్ పరిశీలించి ఆయా వార్డుల వారీగా రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. కౌంటింగ్ హాల్స్ లో టేబుల్స్ ఏర్పా టు, సూపర్వైజర్స్, ఇతర సిబ్బంది నియామకంలో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. ఎన్నిక ల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డులు అందజే యాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా నిర్వహించి విజయవంతం చేయా లని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, ఏఈ గోపాల్, ఇతర అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.












