*నర్సంపేటలో బి ఆర్ ఎస్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , నన్నపనేని నరేందర్.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి వి. విష్ణు బాబు ( ప్రజా గొంతుక న్యూస్ ) , 04 ఫిబ్రవరి 2026.
నర్సంపేట పట్టణంలోని గ్రీన్ రీసార్ట్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి , వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు.
నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపనేని నరేందర్.
సందర్భంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,
* బీఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది.
* రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో 30 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.
* నర్సంపేట మున్సిపల్ పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం.
* అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
* రాబోయే రోజుల్లో అధికార పార్టీ నాయకులకు ఓటు తో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.
అవినీతి గుండా రాజకీయం బొండపెట్టడానికి , అసైన్డ్ భూములను కబ్జాలకు కాకుండా ఉండాలంటే బిఆర్ ఎస్ రావాలని కోరుతున్నారు.
* వ్యాపార వాణిజ్య,విద్యార్థి,యువత,ఇంటిలిజెన్స్,సీఎం సర్వేలో బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని తేలింది
* వరికి ఇచ్చే బోనస్ ముంచింది అని ప్రజలు తెలుపుతున్నారు.
* గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 30 వేల ఇండ్లు ప్రకటించారుఇప్పుడు 10 వేల ఇండ్లు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు.
* రౌడీయీజాన్ని అంతం చేయాలంటే బిఆర్ఎస్ గెలిపించాలి.
* నేను తెచ్చిన 42 కోట్ల నిధులతో కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ప్రస్తుతం నర్సంపేటలో రోడ్లు వేస్తున్నారు.
* తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాలో ముందుండి నడిపించిన వ్యక్తినీ..
* నాపై మాట్లాడిన వారు.. నర్సంపేటను
ఎలా బాగు చేస్తారు.
* అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేస్తలేరు.
* ప్రజల సమస్యల తీర్చేందుకే మున్సిపల్ ఎన్నికలు..
* 57 రకాల రోగ నిర్దారణ కేంద్రాలు,అన్ని విధాలుగా
* నర్సంపేటలో క్రైం రేటు పెరిగిపోతున్నది.
* నాపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే బిఆర్ఎస్ నాయకులు కేసులు పెడితే నేటికీ కేసు ఫైల్ చేయలేదు.ఇక పట్టణ ప్రజలకు రక్షణ ఉంటుందా ? అని వివరించారు.
వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ,
* మేనిఫెస్టోతో ఎన్నికల్లో పోతారు.కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు నెరవేర్చకుండా హామీలు తుంగలో తొక్కారు.
* వరంగల్ జిల్లాలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నర్సంపేటలోనే..
* కాంట్రాక్టు అవతారంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేసిన పనులకు క్వాలిటీ కంట్రోల్ ద్వారా పరిశీలన చేయిస్తాం.
* కేసీఆర్ ప్రభుత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేట అభివృద్ధి జరిగింది.
* వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజలు సమహరించాలి
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, నియోజక వర్గ కో ఆర్డినేటర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.












