E-PAPER

బచ్చన్నపేట రోడ్డు సమస్యపై మార్కెట్ కమిటీ చైర్మన్ చొరవ… 

Date : 03 February 2026, 8:46 pm Posted By : PRAJA GONTHUKA

బచ్చన్నపేట రోడ్డు సమస్యపై మార్కెట్ కమిటీ చైర్మన్ చొరవ… 

బచ్చన్నపేట రోడ్డు సమస్యపై మార్కెట్ కమిటీ చైర్మన్ చొరవ…

రోడ్డుకు 10 రోజుల్లో పరిష్కారం

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట పట్టణ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న గుంతల రోడ్డు సమస్యకు చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న చొరవతో పరిష్కారం దిశగా అడుగు పడింది. పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్డును తక్షణమే మరమ్మత్తు చేయాలని జాతీయ రహదారి విభాగం (ఎన్ హెచ్) డీఈతో చరవాణి లో చర్చించారు.ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, రోడ్డు కారణంగా జరుగుతున్న ప్రమాదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చైర్మన్ శ్వేత వెంకన్న వినతికి స్పందించిన (ఎన్ హెచ్) డీఈ, పది రోజుల లోపు రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మత్తు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారాలు సాధిస్తున్న చైర్మన్ శ్వేత వెంకన్న ప్రయత్నాలను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. రోడ్డు మరమ్మత్తులు పూర్తైతే ప్రయాణికులు, వ్యాపారులు, వాహనదారులకు ఎంతో ఊరట కలగనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్