కోతుల దాడిలో రైతుకు గాయాలు
ప్రజా గొంతుక (ఫిబ్రవరి 3) కాల్వ శ్రీరాంపూర్ : కోతుల దాడిలో వ్యక్తికి కాలు చెయ్యి, విరిగిన ఘటన మండలంలోని మిర్జంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులకు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మీర్జంపేట గ్రామానికి చెందిన కల్వల శ్రీనివాస రెడ్డి అనే రైతు పంట పొలానికి వెళుతుండగా చెట్టుపై ఉన్న కోతుల మంద దాడి చేసింది. ఏడుమ కాలు, కుడి చెయ్యి విరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రథమ చికిత్స కొరకు జమ్మికుంట హాస్పిటల్ కు తరలించి, మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెల్లినట్లు వారు తెలిపారు. మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కోతుల దాడులు జరుగుతూనే ఉన్నాయి, సంబంధిత అధికారులు కోతుల మందుల నుండి గ్రామస్తులను కాపాడాలని కోరుకుంటున్నారు.












