E-PAPER

మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

Date : 02 February 2026, 8:11 pm Posted By : PRAJA GONTHUKA

మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

ప్రజా గొంతుక ప్రతినిధి / పరకాల(ఫిబ్రవరి 02) :

హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది.

సోమవారం పరకాల మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టాటా మ్యాజిక్ డ్రైవర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బొచ్చు సంపత్,

సోషల్ మీడియా కన్వీనర్ బొచ్చు వరప్రసాద్,

బూత్ ఇంచార్జ్ బొచ్చు సుభాష్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ చేరికలు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సమన్వయకర్త, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిపెల్లి వాసుదేవ రెడ్డి సమక్షంలోచేరారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్లో జాయిన్ అయినా నాయకులు మాట్లాడుతూ, పరకాల పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి బిఆర్ఎస్ పార్టీనే సరైన వేదిక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్