E-PAPER

సత్ప్రవర్తనతో ఉంటే నేర చరిత్ర గల వ్యక్తులకు మేలు.

Date : 02 February 2026, 8:06 pm Posted By : PRAJA GONTHUKA

సత్ప్రవర్తనతో ఉంటే నేర చరిత్ర గల వ్యక్తులకు మేలు.

సత్ప్రవర్తనతో ఉంటే నేర చరిత్ర గల వ్యక్తులకు మేలు. "చేర్యాల పట్టణ సిఐ బి.రమేష్"*

(ప్రజాగొంతుక.రిపోర్టర్.బాలకృష్ణ)ఫిబ్రవరి02::మద్దూరు(దూల్మిట్ట)

నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఇక నుండి సత్ప్రవర్తన కలిగి ఉండాలని చేర్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.రమేష్, మరియు మద్దూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఆసిఫ్ సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 13 మందిని సిఐ ముందు హాజరు పరచగా, గతంలో నేరాలకు పాల్పడిన వారు, సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని సూచించారు. చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నేరం చేసే ముందు ఒక్కసారి తమ తమ కుటుంబాల గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని, ఆస్తుల ధ్వంసం భూకబ్జాలు ప్రజలను భయపెట్టడం వంటి చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తే వారికి కఠినమైన శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ సిఐ బి రమేష్, మరియు మద్దూరు ఎస్సై ఎండి ఆసిఫ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

సత్ప్రవర్తనతో ఉంటే నేర చరిత్ర గల వ్యక్తులకు మేలు. “చేర్యాల పట్టణ సిఐ బి.రమేష్”*

(ప్రజాగొంతుక.రిపోర్టర్.బాలకృష్ణ)ఫిబ్రవరి02::మద్దూరు(దూల్మిట్ట)

నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఇక నుండి సత్ప్రవర్తన కలిగి ఉండాలని చేర్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.రమేష్, మరియు మద్దూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఆసిఫ్ సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 13 మందిని సిఐ ముందు హాజరు పరచగా, గతంలో నేరాలకు పాల్పడిన వారు, సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని సూచించారు. చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నేరం చేసే ముందు ఒక్కసారి తమ తమ కుటుంబాల గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని, ఆస్తుల ధ్వంసం భూకబ్జాలు ప్రజలను భయపెట్టడం వంటి చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తే వారికి కఠినమైన శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ సిఐ బి రమేష్, మరియు మద్దూరు ఎస్సై ఎండి ఆసిఫ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్